Sunday, October 25, 2009

Amma song - ఏమిస్తే తీరునమ్మ.... నీ ఋణము....


నా జన్మ కు మూలమై
నను నడిపిన నేలవై
నా బ్రతుకున  దివ్వేవై
ధరిచేర్చిన నావవై
నవ మాసాలు మోసి, కొలిమి కష్టాలకోర్చి తుది శ్వాశ బిగపట్టి ఆది ఊపిరి ఊదినావు
ఏమిస్తే తీరునమ్మ.... నీ ఋణము
ఎన్నటికి మరువమమ్మ నీ త్యాగము
నీ వొడిలో పెంచినావ్
వేలు పట్టి నడిపినావ్
ఓనమాలు నేర్పినావ్
ఓర్పెంతో చూపినావ్
నీ ఎర్రని రక్తాన్ని, తెల్లని పాలుగా మలచి, నా కడుపుని నింపాలని నీ కడుపుని మాడ్చినావు
ఏమిస్తే తీరునమ్మ.... నీ ఋణము
ఎన్నటికి మరువమమ్మ నీ త్యాగము

గుడిలెన్నో చూపినావు
బడిలోనా చేర్చినావు
చదువుతుంటే మురిసినావు
నను గొప్పగా మలిచినావ్
చదువు రాక నేనుంటే, బడికొద్దని బెట్టుచేస్తే , నా చెంపలు వాయించి నువ్వు చెమ్మ గిల్లినావు 


ఏమిస్తే తీరునమ్మ.... నీ ఋణము
ఎన్నటికి మరువమమ్మ నీ త్యాగము

అల్లరెంత చేసినా...
మారేమెంత చేసినా..
సుతి మెత్తగా మందలించి
సుతులెన్నో చెప్పినావు 

ఆరుబయట ఆటకెళ్ళి, పక్కోడితో తో పోరుపడితే ,నాతప్పని తెలిసికూడా  తగువాడి గెలిచినావు
ఏమిస్తే తీరునమ్మ.... నీ ఋణము
ఎన్నటికి మరువమమ్మ నీ త్యాగము


అబద్ధాలు ఆడినా..
అనర్థాలు చేసినా..
గతి తప్పి తిరిగిన
పెడదారిన నడిచిన

నా మీద కోపమొచ్చి, అయ్య కన్నేరచేస్తే పతి దైవం అని మరచి చురకత్తులు దూసినావు

ఏమిస్తే తీరునమ్మ.... నీ ఋణము
ఎన్నటికి మరువమమ్మ నీ త్యాగము


Saturday, October 24, 2009

క్షమించు క్షమించు... ఓ చెలి

Situation: A guy feels pity on him and for his helplessness as he is forced to depart from his Love by this society, parents and family..

క్షమించు క్షమించు... ఓ చెలి
నను క్షమించు క్షమించు... నా చెలి
క్షమించు క్షమించు... ఓ చెలి
నను క్షమించు క్షమించు... నా చెలి


నీ వెంటే నేననుకున్న....
నువుంటే చాలనుకున్న
నా నీడె నీవనుకున్న ....
నీ తోడే నేననుకున్న
నా ఊపిరి నీవనుకున్న
ఇక ఎ సిరి వద్దనుకున్న
ఈ లోకం పామైంది....
నా ప్రేమని కాటేసింది


క్షమించు క్షమించు... ఓ చెలి
నను క్షమించు క్షమించు... నా చెలి
క్షమించు క్షమించు... ఓ చెలి
నను క్షమించు క్షమించు... నా చెలి


ప్రతి రోజు చస్తూ ఉన్న
ఆ చావును పిలిస్తూ ఉన్న
ఆశల శ్వాసాగింది.......
అడి  ఆశల బ్రతుకైంది
చిరునవ్వే కరువైంది....
నా బ్రతుకే బరువైంది
తియ్యని గాయం మాని.....
మానని గాయం మిగిలింది