Showing posts with label Nalgonda. Show all posts
Showing posts with label Nalgonda. Show all posts

Saturday, September 19, 2009

Facts about Telangaana

These songs are written by me. Please forgive for the spelling mistakes, as its really hard to write in Telugu in the Blogs.....

సల్ల సల్లగ లేవుర మన బ్రతుకులు తమ్ముడా

సల్ల సల్లగ లేవుర మన బ్రతుకులు తమ్ముడా

మెల మెల్లగా సాగర తెలంగాణా వీరుడా

పల్లెల్లని పాడుబడ్డై
నీలు లేక నల్ల బడ్డాయి.
పాలమూరు పాడాయే
కరీంనగర్ కుళ్ళి పాయె
ఆదిలాబాదు అరవబట్టే
నిజామాబాదు నల్లగొండ
ఖమ్మములో కరువోచ్చే
వరంగల్లు వంటింట్లో కుండలు కొట్లాడబట్టే
మెదకేమో మోడుబారే కండ్లెంబడి నీళుకారే
తాగానీకే కరువాయే కనీల్లె ఎరాయే

సల్ల సల్లగ లేవుర మన బ్రతుకులు తమ్ముడా
మెల మెల్లగా సాగర తెలంగాణా వీరుడా

అభివృద్ధి అంటాడు
అంత మీకే ఆంటాడు
ఆ ప్రాజెక్ట్ అంటాడు ఈ ప్రాజెక్ట్ అంటాడు
ఆరేళ్ళు గడచిపాయే అరలీటరు తేకపాయే
మట్టి కుండ ఆస సూపి ఎండి బిందె ఎత్క పాయె

సల్ల సల్లగ లేవుర మన బ్రతుకులు తమ్ముడా
మెల మెల్లగా సాగర తెలంగాణా వీరుడా

లగడగాడు జగడమాడే
టి జి గాడు పేచి పెట్టె
ఆడు ఈడు ఎగరబట్టే
మన బ్రతుకులు మనకంటే
కండ్లేందుకు మండబట్టే

సల్ల సల్లగ లేవుర మన బ్రతుకులు తమ్ముడా
మెల మెల్లగా సాగర తెలంగాణా వీరుడా





ఎక్కి ఎక్కి ఏడ్వకమ్మ తెలంగాణా

ఎక్కి ఎక్కి ఏడ్వకమ్మ తెలంగాణా
నీకండంగా మేముంటమమ్మ తెలంగాణా
బక్కసిక్కినావమ్మ తెలంగాణా
నీ బాదలన్ని ఇన్ని కావు తెలంగాణా

కృష్ణమ్మా వచేనమ్మ తెలంగాణా
నీ కస్టాలు తీర్చలేదు తెలంగాణా
గోదారి గయ్యాళి తెలంగాణా
నీకు సవతిపోరు తప్పలేదు తెలంగాణా
సింగరేణి కాలనీలు తెలంగాణా
నీ సిగతరిగి నవ్వేనమ్మ తెలంగాణా
||ఎక్కి ఎక్కి||

రాష్ట్రమంతా పచ్చదనం తెలంగాణా
నీ నేలంతా కరవుమయం తెలంగాణా
పెద్ద పెద్ద పట్టణాలు తెలంగాణా
నీకు పెద్దదిక్కు లేదమ్మా తెలంగాణా
చిన్న ప్రాజెక్టులు తెలంగాణా
అవే నీకు పదివేలు తెలంగాణా
||ఎక్కి ఎక్కి||

నాగార్జున సాగారమ్మ తెలంగాణా
నాల్గు సుక్కలైన లేవమ్మ తెలంగాణా
పోలవరం ప్రాజెక్టు తెలంగాణా
నీ పోలు తేంపినాదమ్మ తెలంగాణా
పోతిరెడ్డి పాడమ్మ తెలంగాణా
నీకు పాడే కట్టనుందమ్మ తెలంగాణా
సుంకాసుల, దేవాదుల తెలంగాణా
సూసి ముర్వనీకే ఉన్నయమ్మ తెలంగాణా
||ఎక్కి ఎక్కి||

అండి గిండి అనేటోల్లకు తెలంగాణా
అహ దండిగా ధనముందమ్మ తెలంగాణా
మన పోరి పోరగాలు తెలంగాణా
అహ పాచి పని చేయబట్టే తెలంగాణా
ఆ రైతు హాయిగుండు తెలంగాణా
మరి మన రైతు మూల్గుతుండు తెలంగాణా
పప్పన్నం దేవుడెరుగు తెలంగాణా
సుక్క ఇసమైన కోనకున్నడు తెలంగాణా

ఎక్కి ఎక్కి ఏడ్వకమ్మ తెలంగాణా
నీకండంగా మేముంటమమ్మ తెలంగాణా
బక్కసిక్కినావమ్మ తెలంగాణా
నీ బాదలన్ని ఇన్ని కావు తెలంగాణా


Song No:3


తెలంగాణా సమర గీతం.

ఈ రేయి, ఆ రాయి చిరునవ్వుల పాపాయి
కదిలాయి, పాడాయి ఒక స్వేచా గీతం
ఆ గీతం పాడింది నవాబులకు చరమ గీతం
మరువలేము మనమెప్పుడు తెలంగాణా సమర గీతం ||2||

పల్లె కదిలింది, పిల్లా కదిలింది ||2||
పడచు కదిలింది, పడతీ కదిలింది
అది చూసిన నవాబులకు
నర నరాన, ఖన ఖనాన
ఉద్భావిందే బయోత్పాతం...... అదే స్వేచా గీతం
ఆ గీతం పాడింది నవాబులకు చరమ గీతం 
మరువలేము మనమెప్పుడు తెలంగాణా సమర గీతం

చుక్క పొడచింది, చినుకు రాలింది ||2||
మొక్క మొలచింది, మానై వెలసింది
ఆ నీడలో, జడి వానలో
యుగ యుగాన, తర తరానా
వినుపించు అనునిత్యం ఆ ప్రళయ గీతం..... అదే స్వేచా గీతం
ఆ గీతం పాడింది నవాబులకు చరమ గీతం 
మరువలేము మనమెప్పుడు తెలంగాణా సమర గీతం