Tuesday, December 22, 2009
My Love Is Gone..... My Love is Gone
నా ఆత్మ నా నుండివిడిపోయినట్టు
నా దేహం నా ఆత్మ తో వేరైనట్టు
నా శ్వాశ ఇక చాలని బిగ పట్టినట్టు
నా ఆశను నీ ద్యాస తరిమేసినట్టు
తోస్తోంది ప్రతి రోజు నే.. చస్తున్నట్టు
ఇక చాలు నీ ప్రేమా...... ప్రేమ మీద ఒట్టు
వికసించిన ప్రతి పువ్వుకి ముళ్ళు మొలచినట్టు
పాలు తాగిన పాము విషము చిమ్మినట్టు
అలరించే కడలి కడకు ఉప్పెనైనట్టు
దయ చూపిన ధరణి మాత దద్దరిల్లి నట్టు
కబలించెను నీ కౌగిలి... మృత్యువైనట్టు
ఇక చాలు నీ ప్రేమా...... ప్రేమ మీద ఒట్టు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment