Saturday, September 12, 2009

నిజంగా వైఎస్ అంత నిస్వార్ధ పరుడా?


వై ఎస్ మనముందు లేక పోవడం నిజంగా తీరని లోటే. నిజంగా వైఎస్ అంత నిస్వార్ధ పరుడా? నిజంగా అంత సహ్వ్రుదయుడా? నిజంగా గొప్ప నేతా?

ఏమో! ఈ పిచ్చి జనాలు ఒకప్పుడు రావణుడిని కొలవలేదా? దుర్యోధనుడిని పూజించలేదా? ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నం ఔతుంది. నిజంగా ప్రజలు అంతలా REACT అయ్యారా? లేక మీడియా సృష్టా. ఏమో తిమ్మి ని బిమ్మి చేయగల సమర్ధులు మన భారతీయ మీడియా వారు.

అయ్యల్లారా! అమ్మల్లారా!, వైఎస్ నిజంగా గొప్ప నాయకుడై ఉన్దోచు గాక, నిజంగా ఒక నిస్వార్ధ హృదయుడై ఉన్దోచు గాక, కాని వైఎస్ నిజంగా మనం అనుకుంటున్నట్టు గొప్ప వాడు ఏమి కాడు. ఒక్క సారి 2004 కీ ముందు 2009 కీ వెనక మనం మన ఆంధ్ర దేశాన్ని చూసిన ఎడల వ్యత్యాసం కొట్తోచినట్టు కనిపిస్తుంది.

జలయజ్ఞం ఇదొక బూటకం.
లక్షల కోట్లు కుమ్మరించి ఎంతో ఆర్భాటంగా జలయజ్ఞం ని ప్రారంబించారు ఈ కాంగ్రెస్ పెద్దలు. ఎన్నో లక్షల హెక్టర్ ల పంటకి సాగునీరు వస్తుందని చెప్పారు. ఇక్కడ ప్రజలు ఒక్కటి గుర్తుంచుకోవాలి. ఇప్పటివరకు జలయజ్ఞం లో మొదలు పెట్టిన ఏ ఒక్క పని పూర్తి కాలేదు. ఇప్పటికి ఏ పంటకి నీరు అందలేదు. ఏ గొంతుక తడవలేదు. మరి ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడికి పోయాయి. జలయజ్ఞం అనే ఒక 'పదకం' పేరు చెప్పి ఎన్నో కోట్లు వైఎస్, వారి వర్గం నేతలు, వారి వారి అనుయాయుల జేబులోకి మళ్ళాయి. బహుశ పాఠకులు నేను ఏదో కాంగ్రెస్ వెతిరేకినని తెదేపా ఎనుకూలుడుఅని ఊహించోచ్చోచు గాకా. నేను ఏ పార్టి కీ సంబంధం లేని వాడిని.

మనది ప్రజాస్వామ్యమా? లేక రాచరికమా? వంద కోట్ల భారతీయులని కేవలం 50 కుటుంబాలే స్వాతంత్ర్యం నుండి పరిపాలిస్తున్నాయి. మహారాజు పోతే యువరాజు, యువరాజు పోతే చిన్నరాజు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే. పాఠకులు ఒక్కటి గుర్తుంచుకోవాలి. మీరు వేసిన ప్రతి వోటు బహుశ వైఎస్ ని దృష్టిలో వుంచుకొని ఉన్దోచు గాక, మరి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏమాత్రం రాష్ట్ర ప్రజల హితములో జరగడం లేదు. 2009 లో వేసిన ప్రతి వోటు వైఎస్ కీ అనుకూలంగా లేక చంద్రబాబు కీ అనుకూలంగా వేసినవే. ఏ ఒక్క వోటు కూడా జగన్ కీ అనుకూలంగా వేయలేదు. మరి ఈ వెర్రి నాయకులూ అంత నిస్సిగ్గుగా జగన్ ని వెనకాల ఎందుకు వేసుకోస్తున్నట్టు? అందులో అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. సీత కష్టాలు సీతవి పీత కష్టాలు పీతవి అనే చందంగా ఎవెరి అవసరాలు వారివి. అంతే కాని ఇక్కడ ప్రజా శ్రేయ్యస్సు లాంటి పెద్ద పెద్ద మాటలకి ఆస్కారం లేదు.

అస్సలు జగన్ దగ్గరగా అంత డబ్బులెక్కడివి?. అన్ని పరిశ్రమలు ఎలా నేలకోల్పగాలుగుతున్నాడు?. వారి కుటుంబ చరిత్ర ఏమిటీ?
నిజంగా వైఎస్ కుటుంబ, బహుశ సంప్పన కుటుంబం ఏమి కాదు. కాని గడచిన ఈ ఆరు ఏళ్లలో, వైఎస్ ప్రవేశపెట్టిన బృహత్ కార్యక్రమాలు ప్రజాకడుపు నింపాయో లేదో తెలియదు కాని జగన్ జేబు మాత్రం నింపాయ్యి. ఆ డబ్బుతోనే బహుశ సాక్షి, దాల్మియా సిమెంట్ లాంటి ఎన్నో కంపనిలని నేలకోల్పగాలిగారు. ఒక పత్రికని పెట్టి, దానిని ఒక ఎతుక్కు తీసుకోనిపోవడానికి ఎన్నో ఏళ్ళు పడుతాయి. అలాంటిది. ఒకేఒక ఉదుకున అంతలా ఆ పత్రికని నిలబెట్టడానికి ఎన్ని ప్రయత్నాలు జరిగుంటయ్యి.

ఇప్పుడు గనక జగన్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర ప్రజల పరిస్తితి "పెనం నుండి పొయ్యిలో పడిన్నట్టుగా" ఔతుంది.

వైఎస్ ఒక మైనారిటీ క్రిస్టియన్. అందుకే ఈ ఆరు ఏళ్లలో మతమరిపిడిలు ఎదేచ్చగా జరిగాయి. అవి చలవన్నాటు, పోతు పోతు దళిత క్రిస్టియన్ బిల్లుని కూడా ఆమోదించి వెళ్ళాడు. మన జనబ్గా గణాంకాల ప్రకారం రాష్ట్రం లో మొత్తం 11 లక్షల మంది క్రిస్టియన్ మైనారిటీలు ఉన్నారు. కాని అనధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రం లో మొత్తం 75 - 85 లక్షల క్రిస్టియన్ మైనారిటీలు ఉన్నారు. అంటే మొత్తం మన జనాభాలో 10 శాతం అన్న మాట. ఈ 6 ఏళ్లలో మొత్తం 15-20 లక్షల మంది మతం మార్చుకున్నారు. ఈ దళిత క్రిస్టియన్ బిల్లు వల్ల ఈ మతమారిపిడులు ఇంకా పెద్దయెత్తున సాగుతాయి అనడంలో సందేహం లేదు. హైదరాబాద్ మహానగారనిదైతే మరి గోరమైన పరిస్తితి.ఈ 6 ఏళ్లలో, MIM ఆగడాలని అడ్డుకోలేక పోయాడు. ఫలితంగా, 7 నియోజకవర్గాలు శాశ్వతంగా ముస్లింల కంచుకోటలుగా మారిపోన్నున్నాయి. తన అవసరాల కోసం, మైనారిటీలని బుజ్జగించే ధోరణిని మరింతగ ప్రోత్సహించిన నాయకుడు వైఎస్. నియోజకవర్గాల పునర్విబజన అనే ముసుగు కింద ఎన్ని మతలబులు జరిగాయో జంట నగరాల ప్రతి పౌరుడుకీ ఎరుక. ఇవ్వని కాదన్నట్టుగా 4% రిజార్వేశాన్లని ప్రవేశపెట్టిన ఘనతకూడా వైఎస్ కే దక్కుతుంది, మతపరమైన రిజార్వేశాన్లు జాతి కీ ఎంతో ప్రమాదం అని ఒక్క పక్క సుప్రిమే కోర్ట్ గోశిస్తున్న పెడచెవిన పెట్టి వాటిని మంజూరు చేసాడు ఈ పెద్దమనిషి. అందుకే కాబోలు పాతబస్తీలో వైఎస్ చనిపోయిన తర్వాత 3 రోజులవరకు వైఎస్ చిత్రపఠములని ఎవ్వరు తీయలేదు. అయిన ఎందుకు తీస్తారులే. అంత మంచి నాయకుడు వారికి మల్లి తిరిగి దొరకడయే. మల్లి నిలౌఫెర్ హాస్పిటల్ లో వైద్యులను చేయిచేసుకోలేరాయే, మల్లి బల్దియా సిబ్బంది మీద తుపాకి గురిపెట్టలేరయే. మల్లి తస్లిమా నస్రీన్ ని దుర్బాశాలడరాయే.

నాకు వైఎస్ మరణ వార్త వినగానే నా మదిలో ఒక్కటే మెదిలింది అది ఏంటంటే,

వైఎస్ ఎప్పుడు వర్షాల గురించి అంటుండే వాడు "వరణుడు కూడా మా పార్టిలో చేరిండు. అందుకే సంవృద్దిగా వర్షాలు పడుతున్నాయి అని"
కాని పరలోకాన ఉన్న ఓ వైఎస్ ఇప్పటికైనా తెలిసిందా, వరణుడు హిందువుల దేవుడని..........., అతనికి ఎలాంటి పార్టిని ఆపధించవోద్దని........., హిందువులని వంచించినవాడిని వరణుడు ఎప్పుడు వదిలిపెట్టడని ..... వరణుడు కాంగ్రెస్ లో కలవలేడు, కాని వైఎస్ ని మట్టిలో కలిపాడు.

అయిన, ప్రపంచంలో ని సర్వశ్రేష్ఠ ధర్మమైన హిందూ ధర్మం లో పుట్టిన నేను, చనిపోయిన వారందరినీ దేవుడు దగ్గరికి పోయిన వారు అని నమ్ముతాను. అందుకే ఓ వైఎస్ ఇవ్వే నా అశ్రునీరజనాలు అందుకో మా వందనాలు.

జై శ్రీ రాం.

2 comments:

Unknown said...

Good post Vinny !!

I really liked you perspective on the leader !!

San said...

YS swardha parude...