నా జన్మ కు మూలమై
నను నడిపిన నేలవై
నా బ్రతుకున దివ్వేవై
ధరిచేర్చిన నావవై
నవ మాసాలు మోసి, కొలిమి కష్టాలకోర్చి తుది శ్వాశ బిగపట్టి ఆది ఊపిరి ఊదినావు
ఏమిస్తే తీరునమ్మ.... నీ ఋణము
ఎన్నటికి మరువమమ్మ నీ త్యాగము
నీ వొడిలో పెంచినావ్
వేలు పట్టి నడిపినావ్
ఓనమాలు నేర్పినావ్
ఓర్పెంతో చూపినావ్
నీ ఎర్రని రక్తాన్ని, తెల్లని పాలుగా మలచి, నా కడుపుని నింపాలని నీ కడుపుని మాడ్చినావు
ఏమిస్తే తీరునమ్మ.... నీ ఋణము
ఎన్నటికి మరువమమ్మ నీ త్యాగము
గుడిలెన్నో చూపినావు
బడిలోనా చేర్చినావు
చదువుతుంటే మురిసినావు
నను గొప్పగా మలిచినావ్
చదువు రాక నేనుంటే, బడికొద్దని బెట్టుచేస్తే , నా చెంపలు వాయించి నువ్వు చెమ్మ గిల్లినావు
ఏమిస్తే తీరునమ్మ.... నీ ఋణము
ఎన్నటికి మరువమమ్మ నీ త్యాగము
అల్లరెంత చేసినా...
మారేమెంత చేసినా..
సుతి మెత్తగా మందలించి
సుతులెన్నో చెప్పినావు
ఆరుబయట ఆటకెళ్ళి, పక్కోడితో తో పోరుపడితే ,నాతప్పని తెలిసికూడా తగువాడి గెలిచినావు
ఏమిస్తే తీరునమ్మ.... నీ ఋణము
ఎన్నటికి మరువమమ్మ నీ త్యాగము
అబద్ధాలు ఆడినా..
అనర్థాలు చేసినా..
గతి తప్పి తిరిగిన
పెడదారిన నడిచిన
నా మీద కోపమొచ్చి, అయ్య కన్నేరచేస్తే పతి దైవం అని మరచి చురకత్తులు దూసినావు
ఏమిస్తే తీరునమ్మ.... నీ ఋణము
ఎన్నటికి మరువమమ్మ నీ త్యాగము
Friday, February 5, 2010
Subscribe to:
Post Comments (Atom)
5 comments:
chaalaa goppagaa undi vinny garu....manchi kurpu ...hrudayam lonunchi vachinattu....
mii ammagaru dhanyulu.....naa ...blessings.....
chala dhanyavadalandi meeku..... mee ashissulu maa kavithaku preranalu
a great song from a telangana son...dedicated to all the telangana mother's..
AMMA praadhaanyame prapancha gyanam. ee geyam abhinandaneeyam.
nice chala bgundi... suprb ga rasavu.........
Post a Comment